మంత్రి కేటీఆర్ నేటి నుండి 10రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకరావడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. బ్రిటన్ తో పాటు స్విట్జర్లాండ్ లో ఆయన పర్యటించనున్నారు. ఇవాళ 10 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి లండన్ కు వెళ్తారు. అక్కడ మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ కానున్నారు.
ఆ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 26న తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో యూకేలోని వెస్ట్ లండన్‌లోని పలు ప్రాంతాల్లో కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.
Off to the United Kingdom for three days to attend meetings organised by @UKIBC and from there on to Davos to attend the world economic forum from 22-26th May
— KTR (@KTRTRS) May 17, 2022
Lots of meetings lined up and hectic activity ahead