హనుమకొండ జిల్లా కమలాపురంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఎంజేపీ స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారితో ముచ్చటించారు. స్కూల్లో వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. డ్రోన్ల వినియోగం గురించి వారికి వివరించారు. డ్రోన్లతో రైతుల పంట పొలాలపై పురుగుల మందు చల్లవచ్చని చెప్పారు. అంతేకాకుండా డ్రోన్ అంటే కెమెరా మాత్రమే కాదని మనుషులను తీసుకెళ్లే వాహనం కూడా అవుతుందన్నారు. డ్రోన్‌తో అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చని.. అలాగే గుట్టలు, చెరువులు, కుంటలు సరిహద్దులను నిర్థారించవచ్చని ఆయన వివరించారు.
విద్యార్థులంతా చక్కగా చదువుకుని ఉద్యోగం చేయాలని కేటీఆర్ సూచించారు. మీతో పాటు పది మందికి ఉపాధి కల్పించవచ్చని అన్నారు. రాబోయే రోజుల్లో అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులను వరంగల్ ,హైదరాబాద్‌లోని టీ-హబ్ టాస్క్‌కు తీసుకురావాలని కలెక్టర్, ప్రిన్సిపాల్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.