మంత్రి కేటీఆర్​కు భద్రాచలం వచ్చే హక్కు లేదు

మంత్రి కేటీఆర్​కు భద్రాచలం వచ్చే హక్కు లేదు

మంత్రి కేటీఆర్​కు భద్రాచలం వచ్చే నైతిక హక్కు లేదంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నారు. పదేళ్ల కాలంలో భద్రాచలం ప్రాంత అభివృద్ధికి ఏమి చేశారంటూ శుక్రవారం వివిధ పార్టీల నేతలు నిలదీశారు. చిన్నసారు, పెద్దసార్లకు గతంలో ఇచ్చిన హామీలు యాదికున్నయా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సీపీఐ టౌన్​సెక్రటరీ ఆకోజు సునీల్​తమ పార్టీ ఆఫీసుల్లో వేర్వేరుగా ప్రెస్​మీట్​పెట్టి మాట్లాడారు.

ఎన్నికల టైంలో శంకుస్థాపనలు చేసి మరోసారి మోసం చేసేందుకే వస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్​గతంలో భద్రాచలానికి ఇస్తామన్న రూ.1000కోట్లు, రామాలయానికి ఇస్తామన్న రూ.100కోట్ల హామీలపై, శ్రీరామనవమికి తలంబ్రాలు తీసుకురాకుండా ముఖం చాటేస్తున్న సీఎం ప్రవర్తనపై సమాధానం చెప్పాలన్నారు. సీపీఎం టౌన్​సెక్రటరీ గడ్డం స్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్​ సెంటర్లో నిరసన ప్రదర్శన చేశారు.

కేటీఆర్ పర్యటన అంతా డ్రామా అంటూ ఎద్దేవా చేశారు. ఐదు పంచాయతీలను ఆంధ్రా నుంచి తీసుకురాలేని అసమర్థ బీఆర్ఎస్​ సర్కారు అంటూ నినాదాలు చేశారు. భద్రాచలం అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ టీడీపీ లీడర్లు మండిపడ్డారు.