గేటెడ్ కమ్యూనిటీల్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు

గేటెడ్ కమ్యూనిటీల్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం గృహ సముదాయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండ్లతో పాటు అక్కడ ఉండే వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ వ్యక్తులు, బిల్డర్లు గేడెట్ కమ్యూనిటీలు కట్టిన తీరులో తమ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిందని చెప్పారు. పేదల నుంచి ఒక్క పైసా కూడా కట్టించుకోకుండా వీటిని అందిస్తున్నామన్నారు. కేసీఆర్ శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో 18 వేల కోట్ల రూపాయలతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం చేపడుతున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్నం అన్న తేడా లేకుండా పేదలకు ఎక్కడికక్కడ 2 లక్షల 80 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ క్రమంగా నిర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఇండ్లు రాని వారికి త్వరలోనే న్యాయం చేసేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ముస్తాబాద్ లో ఇవాళ 155 మంది ఇండ్లు అందాయని, మరో 60 నుంచి 70 మందికి ఇండ్లు రావాల్సి ఉందని సర్పంచ్ తన దృష్టికి తెచ్చారని, వాళ్లకు కూడా అందించే బాధ్యత తమదని కేటీఆర్ అన్నారు. గతంలో అసలు డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం ముందుకు నడుస్తదా లేదా అన్న అనుమానాలను చాలా మంది వ్యక్తం చేశారని, కానీ కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకొంటున్నారని అన్నారు. గతంలో పేదవాడికి ప్రభుత్వాలు ఇచ్చే ఇండ్లు అంటే అనేక కండిషన్లు ఉండేవని, సగం డబ్బులు ప్రభుత్వం ఇస్తే, సగం లబ్ధిదారులే పెట్టుకోవాలని చెప్పేవారని, పైగా ప్రభుత్వం కట్టించే ఇండ్లు కూడా ఒక్కటే ఒక్క అర్ర ఉండేదని కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితిని కేసీఆర్ మార్చేశారని, పేదవాడిపై ఎటువంటి భారం లేకుండా అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు తాము లబ్ధిదారులకు అందజేస్తున్న ఇంటిని ఒక ప్రైవేట్ బిల్డర్ కట్టిస్తే కనీసం రూ.25 లక్షలు అవుతుందని, కానీ తమ ప్రభుత్వం పేదల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నామని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

భర్త నుంచి విడిపోయిన మరో నటి

సామాన్యుడిలా క్యూలో నిల్చుని ఓటేసిన కేంద్ర మంత్రి

శ్రీవారి భక్తులకు శుభవార్త