ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తుంది. హనుమకొండ జిల్లా పరకాల సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ లక్కీ నెంబర్, ఎన్నికల షెడ్యూల్ ముడిపెడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కేటీఆర్. నవంబర్ 30వ తేదీ పోలింగ్.. అందులో మూడు అంకె ఉంది.. కౌంటింగ్ డిసెంబర్ 3వ తేదీ అందులోనూ మూడు ఉంది.. పోలింగ్, కౌంటింగ్ రెండూ కలిపితే 3 ప్లస్ 3.. ఆరు వస్తుంది.. కేసీఆర్ లక్కీ నెంబర్ కూడా అదే... -అంతా శుభ పరిణామమే లెక్క కుదిరింది కాబట్టి మూడో సారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం అంటూ జ్యోతిష్యం చెప్పారు మంత్రి కేటీఆర్.
మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగం కోసం జనమంతా ఎదురు చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నారని.. రేపో మాపో పులి బయటకు వస్తుందని చెప్పారు. ఎగిరెగిరి పడుతున్న కొంతమంది గుంట నక్కలు, తోడెళ్లన్ని బొక్కలోకి పోవడం ఖాయమని చెప్పారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి లాంటి నాయకులు తొర్రలకు పోవాల్సిందేనని సెటైర్స్ వేశారు.
ALSO READ : రియల్ స్పైడర్ మ్యాన్ : రన్నింగ్ రైలుపై పరిగెడుతున్న వ్యక్తి.. ఇట్స్ రియల్లీ షాక్
మంత్రి కేటీఆర్ సోమవారం పరకాలలో పర్యటించి.. . స్థానిక మున్సిపాలిటీ పరిధిలో రూ.114.65కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భవనాలను ప్రారంభించారు. అనంతరం పరకాల పశువుల సంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని, కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ పిలుపిచ్చారు.