13 గుంటల పార్క్ భూమి కబ్జా

  •     13 గుంటల స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులు
  •     ఇండ్లు కట్టడంతో హద్దులు గుర్తించలేకపోయాం అంటున్న ఆఫీసర్లు
  •     ఇప్పటివరకు మొదలు కాని పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు
  •     నేడు నేరేడుచర్లలో మరోసారి పర్యటించనున్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నేరేడుచర్ల, వెలుగు : సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు కోసం స్వయంగా మంత్రి కేటీఆరే శంకుస్థాపన చేసిన స్థలం ఇప్పుడు కనిపించకుండా పోయింది. సర్వే చేసి స్థలాన్ని గుర్తించాల్సిన ఆఫీసర్లు హద్దులు దొరకడం లేదంటూ చేతులెత్తేశారు. దీంతో రెండేళ్ల కింద శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు ప్రారంభం కాలేదు. నేడు నేరేడుచర్ల మున్సిపాలిటీలో మంత్రి మరోసారి పర్యటించనున్నందున ఇప్పటికైనా పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

13 గుంటల భూమి కబ్జా

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డులో అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్కు నిర్మించేందుకు 1.07 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పార్క్ నిర్మాణం కోసం 2020 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 29న మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకుస్థాపన చేశారు. తర్వాత టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించే టైంలో పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కేటాయించిన స్థలంలో సుమారు 13 గుంటలు కబ్జాకు గురైనట్లు మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు గుర్తించారు. పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి సరిపోను స్థలం లేకపోవడంతో స్థలాన్ని పూర్తిస్థాయిలో గుర్తించి హద్దురాళ్లు పాతించాలని కోరారు. 

కానీ రెవెన్యూ ఆఫీసర్లు మాత్రం మొక్కుబడిగా సర్వే చేయడంతో కబ్జాకు గురైన స్థలం తేలలేదు. కొందరు ఇండ్లు నిర్మించుకోవడంతో హద్దురాళ్లు దొరకడం కష్టంగా మారిందని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. మరో వైపు కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకొని పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆరో వార్డు కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాళ్లూరి సాయిరాం గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అయినా ఆఫీసర్లు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 

కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. భూమిని స్వాధీనం చేసుకొని పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులను ప్రారంభించాలి. మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకుస్థాపన చేసి రెండేళ్లు గడిచినా పనులు ప్రారంభించకపోవడం సరికాదు. - కొణతం నాగిరెడ్డి, నేరేడుచర్ల

ఉన్నతాధికారులకు రిపోర్టు ఇచ్చాం 

నేరేడుచర్లలో అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి 1.07 ఎకరాల భూమి కేటాయించాం. ప్రస్తుతం రెవెన్యూ శాఖ సర్వే చేస్తే 34 గుంటల భూమి మాత్రమే తేలింది. దీనిపై ఉన్నతాధికారులకు రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపించాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. - వెంకటేశ్వర్లు, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేరేడుచర్ల