స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ లో విభేదాలు కొలిక్కి వచ్చాయి. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే రాజయ్య. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య రాజీ కుదిరింది. ప్రగతి భవన్‌లో వీరితో సమావేశమైన కేటీఆర్ చర్చించారు.
రాజయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కడియం గెలుపు కోసం పాటుపడతానని తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్యకు కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.
ALSO READ : ఆరేళ్ళ తర్వాత కలిసి వస్తున్నారు.. మరోసారి ఆసీస్ ని వణికిస్తారా..?
రాజయ్య మద్దతుతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని కడియం ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన విషయం తెలిసిందే.