తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలను మోసం చేసిన ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ లో కాలు పెట్టే అర్హత మోదీకి లేదని.. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటును చిన్నచూపు చూస్తున్న మోదీ.. తెలంగాణ రాష్ట్రానికి ఎలా వస్తారంటూ నిలదీశారు మంత్రి కేటీఆర్.
పదేళ్లుగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా మోసం చేస్తున్నారని.. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదన్నారాయన. రాబోయే ఎన్నికల్లో తెలంగాణల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని.. ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు కేటీఆర్. పదే పదే తెలంగాణపై విషం చిమ్ముతూ.. విమర్శలు చేస్తున్న బీజేపీకి.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారంటూ విమర్శలు చేశారు కేటీఆర్.
Also Read :- తమిళిసై మోదీ ఏజెంట్గా పనిచేస్తున్నరు అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా..?
మోదీ అవినీతి ప్రధానమంత్రి అని.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతను మోసం చేయలేదా అంటూ బీజేపీని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు.