పొన్నాల చేరతానంటే ఇంటికెళ్లి ఆహ్వానిస్తా : కేటీఆర్‌

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన  పీసీసీ మాజీ చీఫ్  పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరుతానంటే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆర్ఎస్ లో చేరుతారని చెప్పారు.  కాంగ్రెస్‌లో అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్‌లో తన్నుకుంటారని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ లీడర్‌ కాదన్న మంత్రి కేటీఆర్.. ఆయన మంచి  రీడర్‌ అని ఎద్దేవా చేశారు. రాహుల్‌ రాసిచ్చింది మాత్రమే చదువుతారని అన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ తల్లి ఆత్మగౌరవానికి, ఢిల్లీ.. గుజరాత్‌ అహంకారానికి మధ్య పోటీ అని చెప్పారు.  ఇక అమిత్ షా  అబద్ధాలకు హద్దే లేదన్న మంత్రి...  ఈసారి కూడా 110 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని .. సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు.  

బీఆర్ఎస్ లోకి పొన్నాల 

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయనకు జనగామ టికెట్ ఇచ్చేందుకు కారు పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. జనగామ కాంగ్రెస్ టికెట్ ఆశించిన పొన్నాల నిన్నటి వరకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనేతలను కలిశారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 34 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఆశాజనకంగా కనిపించకపోవడంతో ఆయన ఇవాళ రాజీనామా చేశారు. 

ALSO READ : షూటింగ్లో గాయపడ్డ రవితేజ.. మోకాలికి 12 కుట్లు : నిర్మాత అభిషేక్​ అగర్వాల్