హైదరాబాద్‌లో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శానిటేషన్ సంబంధిత విభాగాల అధికారులతో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గ్రోత్ కారిడార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కమిషనర్ రోనాల్డ్ రోస, జోనల్ కమిషనర్లు, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి ఇంజినీర్లు హాజరయ్యారు. భారీ వర్షాలు ఉన్నందున నగరంలో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.
డ్రైనేజీలు పొంగితే సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునా అధికారులు అప్రమత్తంగా పని చేయాలని సూచించారు.
అనుకోని ఘటన ఏదైనా జరిగితే సంబంధిత అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. నాలాల విస్తరణ పనుల గురించి ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.