గ్రేటర్ వరంగల్​ డెవలప్ మెంట్​ వర్క్స్ పై మంత్రి కేటీఆర్ ​రివ్యూ

  • రెండో విడత మిషన్​ భగీరథకు ప్రపోజల్స్ ​పంపండి
  •  గ్రేటర్​ డెవలప్ మెంట్​ వర్క్స్ పై మంత్రి కేటీఆర్ ​రివ్యూ


హనుమకొండ, వరంగల్, వెలుగు: వరంగల్ ఇన్నర్​రింగ్​రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించి, నెలలోగా పనులు ప్రారంభించాలని మున్సిపల్, ఐటీ  మంత్రి కేటీఆర్ ​ఆఫీసర్లను ఆదేశించారు. వరంగల్  బస్టాండ్​పనులు కూడా నెలలోపే మొదలు పెట్టి, ఏడాదిలోగా  పూర్తిచేయాలని డెడ్​లైన్ ​పెట్టారు. నగరంలో రూ.181.45 కోట్లతో చేపట్టిన వివిధ పనులను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్.. గ్రేటర్​వరంగల్​​అభివృద్ధి పనులపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో రివ్యూ చేశారు. వరంగల్ లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులున్న 51 కాలనీల్లోని ఇండ్లకు మిషన్ భగీరథ రెండో దశలో నీటిని సరాఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా చేపట్టిన వివిధ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, కొద్ది రోజుల్లోనే  మిగతా వాటిని పూర్తిచేస్తామని ఆఫీసర్లు మంత్రి కేటీఆర్ కు వివరించారు. 

మల్టీపర్పస్​కమ్యూనిటీ హాళ్లు కట్టాలి

వరంగల్ సిటీలో ఆరేడు చోట్ల భారీ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు కట్టాలని మంత్రి కేటీఆర్​సూచించారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. మామునూరు విమానాశ్రయానికి సంబంధించి, అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి వెంటనే సమర్పించాలని సూచించారు. జీవో 58, 59 పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కేటీఆర్ ఆఫీసర్లకు తెలిపారు.  

త్రీ ' ఐ' నినాదంతోనే  భారత్ ముందుకు..

హసన్​పర్తి: త్రీ 'ఐ'నినాదంతో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ నిలుస్తోందని మంత్రి కేటీఆర్​ చెప్పారు. వరంగల్ కిట్స్​కాలేజీలో రూ.1.26 కోట్లతో నిర్మించిన ఇన్నోవేషన్​ ఇంక్యుబేషన్​సెంటర్​ను మంత్రి కేటీఆర్​ప్రారంభించారు. అనంతరం అక్కడి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. మంత్రి కేటీఆర్​మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో తనకూ పాల్గొనే అవకాశం వచ్చిందన్నారు. సమావేళంలో ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్​క్లూజివ్ గ్రోత్ టార్గెట్​గా పని చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశానన్నారు. హుస్నాబాద్​నుంచి హెలిక్యాప్టర్​లో నేరుగా వరంగల్ చేరుకున్న మంత్రి కేటీఆర్​ టూర్​ దాదాపు రెండు గంటల ఆలస్యంగా జరిగింది. మంత్రి కేటీఆర్​టూర్​లో భాగంగా బీఆర్ఎస్​ వరంగల్ జిల్లా ఆఫీస్​కు శంకుస్థాపన చేయాల్సి ఉండగా..  అప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఆయన నేరుగా బహిరంగ సభకు వెళ్లారు. దీంతో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నారాజ్​అయ్యారు. మంత్రి కేటీఆర్​ రాకపోవడంతో స్థానిక నేతలతో కలిసి ఆయనే మొదట పూజలు నిర్వహించారు.