తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ అభివృద్ధి బాటలో నడుస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అభివృద్ధి కోసం మంత్రి గంగుల కమలాకర్ చొరవ, అంకితభావం చెప్పుకోదగినదన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో ప్రజాప్రతినిధులందరూ అధికారులతో మర్యాదగా నడుచుకోవాలని, సంస్కారవంతంగా కలిసిపని చేయాలని హెచ్చరించారు.
కౌన్సిల్ సమావేశాలకు మీడియాను అనుమతించవద్దన్నారు మంత్రి కేటీఆర్. సమావేశం ముగిసిన తర్వాత సమాచారాన్ని మీడియాకు తెలియజేయాలన్నారు. మీడియా తన మాటలను వక్రీకరించినా.. ఈ విషయం చెప్పక తప్పడం లేదన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు.