- జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి
- బాన్సువాడలో రేవంత్‌రెడ్డి స్పీకర్‌ని తిట్టడం నన్ను బాధించింది
- మంత్రి కేటీఆర్
కామారెడ్డి, బాన్సువాడ, వెలుగు : బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు కావాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం బాన్సువాడ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రూ.129 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అందులో మున్సిపల్ ఆఫీస్, ఆర్డీవో ఆఫీస్, అంబేద్కర్‌భవన్, పార్కులు ఉన్నాయి. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ ద్వారా మల్లన్నసాగర్ కు, అక్కడి నుంచి నిజాంసాగర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు.
నిజాంసాగర్‌కు ఇక సాగు నీళ్లకు కొదవ ఉండదన్నారు. జుక్కల్‌లో నాగమడుగు ఎత్తిపోతల స్కీమ్ చేపట్టామన్నారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను బంపర్ మెజార్టీతో గెలిపించాలన్నారు. బాన్సువాడకు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వచ్చి స్పీకర్‌ను తిట్టడం తనను బాధించిదని మంత్రి పేర్కొన్నారు. ఆయన హోదా, వయసు, అనుభవానికి విలువ ఇవ్వాలన్నారు. సీఎం, స్పీకర్ పై రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల కాలంలో నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 11 వేల డబుల్ బెడ్రూమ్ఇండ్లు నిర్మించామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతుబంధు, వ్యవసాయానికి 24 కరెంట్అమలు చేయడం లేదన్నారు. జుక్కల్ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదర్ శోభ, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, లీడర్లు పోచారం సురేందర్‌రెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడలో మంత్రి కేటీఆర్ ప్రోగ్రామ్ దృష్ట్యా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.