డేటా సెంటర్ ఆఫీసును ప్రారంభించిన కేటీఆర్

డేటా సెంటర్ ఆఫీసును ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్: నానక్రామ్ గూడలోని వన్వెస్ట్లో గ్రామెనర్ ఇన్సైట్స్ డేటా సెంటర్ ఆఫీస్ను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. భారత్లో డేటా సైన్స్కు గత ప్రభుత్వాలు తక్కువ ప్రాధాన్యం ఇచ్చాయన్నారు. ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేశామని.. దీంతో ఈ రంగం వేగంగా పుంజుకుంటోందన్నారు. బలమైన సాంకేతికత సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని చెప్పారు.- ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే లాంటి అతిపెద్ద డేటా ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, భాగస్వామ్యం కోసం డేటా సైన్స్ అవసరమని పేర్కొన్నారు.  మున్సిపల్ శాఖల్లో పలు ప్రాజెక్టులకు గ్రామెనర్తో కలిసి పనిచేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని బిల్డర్స్ అందరూ.. తమ చుట్టుపక్కల చెరువుల్ని అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, టెర్మినస్ గ్రూప్ చైర్మన్ ఎస్పీ రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

కమల్ హాసన్ ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఉబర్​ ఇండియా సీఈవో @ క్యాబ్ డ్రైవర్

నెట్ లేకున్నా.. మిస్డ్​కాల్​తో పేమెంట్స్