జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నవంబర్ 28న ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని ఆయన అన్నారు. ‘నవంబర్ 28న ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుంది. జీహెచ్ఎంసీకి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది సీఎం కేసీఆర్ సభలో వివరిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలందరూ ఈ సభకు రావాలి. కోవిడ్ నియమాలకు లోబడి సభ ఉంటుంది. అందరికి శానిటైజర్లు, మాస్కులు ఇస్తాం. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను కేసీఆర్ వివరిస్తారు. హైదరాబాద్‌లో చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోం. ఓ పిచ్చోడు సమాధులు కూలుస్తాం అంటాడు. మరొక పిచ్చోడు జనాలను, బండ్లను రాంగ్‌రూట్‌లో వెళ్ళండి అంటాడు. హైదరాబాద్‌లో మతం, కులం పేరుతో చిచ్చు పెడుతామంటే ఊరుకోం. ఎంఐఎం, బీజేపీలే కాదు ఏ పార్టీ అల్లర్లు చేసినా ఊరుకోం. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేస్తారు. ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వెళ్లడం సహజం’ అని ఆయన అన్నారు.
For More News..