హైదరాబాద్ : కైతలపూర్ లో డంపింగ్ యార్డ్ సమస్య ఉందని.. త్వరలోనే శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం ఆయన మూసాపేట్ సర్కిల్ లోని అంబేద్కర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు రూ. 99 లక్షల రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. కైతలపూర్ లో డంపింగ్ యార్డ్ సమస్య ఉన్నందున, ఇక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆధునీకరణ ట్రాన్స్‌ఫర్ పాయింట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వర్షాకాలంలో ఇండ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని.. పనులకు ఎమ్మెల్యే బాధ్యత తీసుకుంటారన్నారు. శివారు ప్రాంతాలకు నీటిని ఇస్తున్నామని.. డ్రైనేజి సిస్టమ్ ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని..మిగతా పనులను త్వరలోనే కంప్లీట్ చేస్తామన్నారు. కరోనా పూర్తిగా పోలేదని.. మరోసారి లాక్ డౌన్ రావద్దంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు మంత్రి కేటీఆర్.