రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్లలో ఇంటింటి తిరిగి ఓటు అడగాలని ఉంది కానీ బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్గా రాష్ట్రం అంతటా తిరగాల్సి వస్తోందని, అందుకే దండంపెట్టి మిమ్మల్ని ఓటడగలేకపోతున్నానని సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ వాపోయారు. మంగళవారం ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్యెల్యే అయ్యాక సిరిసిల్ల నియోజకర్గం, ముస్తాబాద్ మండలం ఎంత అబివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసన్నారు. 9 ఏండ్లలో కండ్ల ముందు జరిగిన అభివృద్ధిని నమ్మాలే గానీ సోషల్మీడియాలో అసత్య ప్రచారాన్ని కాదన్నారు.
కాంగ్రెస్, బీజేపోళ్ల మాటలు నమ్మొద్దని, కులం, మతం పేరిట వారు ఓట్లడుగుతారని, తాము అభివృద్ధి పేరిట అడుగుతున్నామన్నారు. తాను రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నందున, సిరిసిల్లలో చేయకపోయినా తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రపంచం గర్వించేలా సిరిసిల్లను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ శరత్ రావు, లీడర్లు గోపాల్‌రావు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : బీఆర్ఎస్ప్రజలను మోసం చేసింది : ప్రణవ్