ఎన్టీఆర్ చేయలేనిది.. కేసీఆర్ చేసి చూపిస్తరు: కేటీఆర్

తారకరామారావు పేరులోనే పవర్ ఉందన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎన్టీఆర్  ఆరాధ్య ధైవమన్నారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెల్వదని.. రాముడైనా..కృష్ణుడైనా తమకు ఎన్టీఆరేనన్నారు. ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్లతో  నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహాన్ని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఎన్టీఆర్ విగ్రహం  ఆవిష్కరించే అవకాశం తనకు రావడం అదృష్టమన్నారు.   ఎన్టీఆర్ గొప్ప నాయకుడు, గొప్ప నటుడు.. ఎన్నో సాధించారని.. అయితే జీవితంలో  ఒకటి మాత్రం సాధించ లేకపోయారన్నారు.. అయితే ఆ అవకాశం ఆయన  శిష్యుడు కేసీఆర్ కు ఉందన్నారు. ఎన్టీఆర్ వరుసగా మూడు సార్లు సీఎం కాలేకపోయారని.. కేసీఆర్ కు ఖమ్మం ప్రజల ఆశీస్సులో హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందన్నారు.

కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కర్ణాటక నుంచి వందల కోట్లు తెస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సొమ్ము తీసుకుని బీఆర్ఎస్ కు ఓటేయాలన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమి లేదన్నారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఎంతో ప్రగతి సాధించారని తెలిపారు..  వారంటీ లేని కాంగ్రెస్ హామీలకు గ్యారెంటీ ఉండదన్నారు.  కాంగ్రెస్ హయాంలో రైతులకు 6 గంటల కరెంట్ ఇవ్వలేదన్నారు.