జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి కేటీఆర్ సీరియస్

జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి కేటీఆర్ సీరియస్

బల్దియా అధికారులపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వర్షాకాలం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు తీసుకున్న జాగ్రత్తలు,  తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతిభవన్లో  మంత్రి కేటీఆర్ సమీక్ష  నిర్వహించారు. మూడు గంటలకు పైగా జరిగిన రివ్యూలో SNDP స్టేటస్, నాలా పరిసరాల్లో తీసుకున్న జాగ్రత్తలతో పాటు..గతేడాది నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిపై  వివరాలు అడిగి తెలుసుకున్నారు. SNDP పనులు ఆలస్యంపై మంత్రి కేటీఆర్ అధికారులపై సీరియస్ అయ్యారు. 2020లో చేపట్టిన పనులు ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. రెండేళ్లుగా సిటీలో కురిసిన భారీ వర్షాలు, జరిగిన డ్యామేజీ  చూశాక కూడా..ఇంత నిర్లక్ష్యం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పనుల ఆలస్యానికి కాంట్రాక్టర్లే కారణమని ఇంజనీరింగ్ అధికారులు మంత్రి కేటీఆర్కు   తెలిపారు.  బిల్లులు రావని టెండర్లు వేయలేదని వెల్లడించారు. టెండర్ల ఫైనల్ తర్వాతే పనులు స్పీడప్ అయ్యాయని అధికారులు తెలిపారు. రెండు నెలల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ కు వివరించారు.