యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన స్నేహితులతో కలిసి మే16 బుధవారం రోజు సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హిమాన్షుతో పాటు అతని స్నేహితులు ప్రత్యేక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లే ముందు స్వామివారిని దర్శించుకున్నారు హిమాన్షు. అంతకుముందు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన హిమాన్షుకు యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద స్థానిక బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.