
బరాబర్ తమది కుటుంబ పాలన అని మంత్రి కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో రూ.125 కోట్లతో పలు అబివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో ఎవ్వరీకీ అర్థం కాదని కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోడీ ఎవరికి దేవుడు..ఎందుకు దేవుడని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతున్నందుకు మోడీ దేవుడా? అని ప్రశ్నించారు. ఆదానికి దేవుడు కావొచ్చు కానీ.. తెలంగాణ ప్రజలకు దేవుడు కాదన్నారు. బీజేపీకి హిందు.. ముస్లీం తప్ప మరోకటి తెల్వదన్నారు. కిషన్ రెడ్డికి మైండ్ మోకాళ్లలో ఉందో ? అరికాళ్లలో ఉందో అర్థం కాదని విమర్శించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయని కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ఒక్క చాన్స్ అడగడం అవివేకమని కేటీఆర్ అన్నారు. హంతకుడే సంతాపం చెప్పినట్లు రేవంత్ రెడ్డి మాటలున్నాయన్నారు. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటను ఎవ్వరూ నమ్మరని చెప్పారు. 50 ఏళ్లు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే గుడ్డి గుర్రం పండ్లు తోమారా అంటూ ఎద్దేవా చేశారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఎగిరేది మళ్లీ బీఆర్ఎస్ జెండానే అని చెప్పారు.