తొమ్మిదిన్నర ఏళ్లుగా నేను చేసిన అభివృద్ధిని చూశారు.. ఎవరు కావాలో తేల్చుకోండి : కేటీఆర్

యువత సోషల్ మీడియా ద్వారా  బీఆర్ఎస్ కోసం పనిచేయాలని సూచించారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల పట్టణం పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్  యువ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.  ప్రతి రోజు దినచర్య స్టార్ట్ అయ్యేది సోషల్ మీడియాతోనేనని చెప్పారు. సోషల్ మీడియాలో  ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు చూపిస్తున్నారని విమర్శించారు. యువత  ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలన్నారు.  అభివృద్ధి చేయడానికి  తమకు కేసీఆర్, కేటీఆర్   ఉన్నారని ఓటర్లకు చెప్పాలన్నారు.  ఒకప్పుడు బతుకమ్మ ఆడుకోవాలంటే ఒక కొలను తవ్వి బతుకమ్మలు వేసుకునే వాళ్లని..ఇపుడు, 24 గంటలు తంగాల్ల పల్లి బ్రిడ్జి కింద నీళ్లున్నాయని తెలిపారు.

అభివృద్ధిని చూసి ఓటేయాలని సూచించారు కేటీఆర్. తనకు కులం, మతం లేదని.. తొమ్మిదన్నరేళ్లు ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు.  తెలంగాణ సాధన కోసం  జైలుకు వెళ్లానని.. కేసీఆర్ దయతోనే మంత్రి అయ్యానని చెప్పారు.  ఏ దేశం వెళ్లినా తాను సిరిసిల్ల అని గర్వంగా చెప్పుకుంటానన్నారు. 

 14 ఏళ్లుగా తాను ఎలా పనిచేశానో చూసి ఓటేయాలని సూచించారు కేటీఆర్. అన్ని రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు కానీ.. తెలంగాణలో రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు సీఎంగా  ఉన్నారని చెప్పారు. తులం బంగారం ఇచ్చినా  నచ్చిన వారికే  ఓటు వేసి గెలిపిస్తారని చెప్పారు. సిరిసిల్లలో మెడికల్ కాలేజీ,పీసీ, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు  చేసుకున్నామని తెలిపారు.  కాంగ్రెస్ కు 11 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏం చేయలేదన్నారు.