వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ విజయం సాధించడం, కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 95 నుంచి 100 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన ప్రగతినివేదన సభలో ఆయన పాల్గొన్నారు. తుంగతుర్తి నుండి హ్యాట్రిక్ కొట్టబోయే ఎమ్మెల్యే గాదరి కిషోర్ అని కేటీఆర్ జోస్యం చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో 40 వేల మెజారిటీతో కిషోర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. తొమ్మిదేళ్లలో ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే రూ. 6వేల కోట్లతో అభివృద్ధి జరిగిందని, సంక్షేమ పథకాలు అందాయని కేటీఆర్ చెప్పారు. అంతకుముందు తిరుమలగిరి మున్సిపాలిటీలో 80 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు,జెడ్పీ చైర్మన్ లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ సాయిచంద్‌కు నివాళులర్పించారు.