డబుల్‌‌ ఇండ్లలోకి పోవుడు ఎప్పుడో.. ఐదు నెలలుగా తప్పని ఎదురుచూపులు

  • వాటర్‌‌, కరెంట్‌‌ సమస్య పరిష్కరించని ఆఫీసర్లు
  • 544 మంది లబ్దిదారుల లిస్ట్‌‌ ప్రకటించిన కలెక్టర్‌‌
  • ఇండ్లల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న ఆఫీసర్లు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు :  భూపాలపల్లి టౌన్‌‌లో 544 డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్​ ప్రారంభించినా నేటికీ ఖాళీగానే ఉంటున్నాయి. రూ. 33 కోట్ల ఖర్చుతో వీటిని నిర్మించి, అర్హులను ప్రకటించారు. కానీ, వాటర్‌‌, కరెంట్‌‌ సమస్య ఉందని ప్రజలను ఇండ్లలోకి వెళ్లనీయడం లేదు. మరోవైపు ఇండ్ల కోసం పేద ప్రజలు పోరాటం చేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. రేపు.. మాపు అంటూ లబ్ధిదారులను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నరు. దీంతో పేదలు కిరాయి ఇండ్లలోనే ఉంటున్నారు. 

ఐదు నెలలుగా ఎదురుచూపులే!

భూపాలపల్లి మున్సిపాలిటీలో సుమారు 60 వేలకు పైగా జనాభా ఉంది. 2016‒17లో   వేశాలపల్లి దగ్గర జీ ప్లస్‌‌ త్రీ పద్దతిలో డబుల్​ ఇండ్లను నిర్మించారు. 2019 ఎలక్షన్ల నాటికే ఇంజినీరింగ్‌‌ సివిల్‌‌ వర్క్‌‌లు పూర్తయ్యాయి. ఆ తర్వాత సీసీ రోడ్ల నిర్మాణం, వాటర్‌‌ పైప్‌ ‌లైన్లు, కరెంట్‌‌ పనులు పెండింగ్​లో ఉన్నాయని, పంపిణీ చేయకుండా ఆపేశారు. నిర్మాణాలు పూర్తయ్యాక.. కిందటి ఫిబ్రవరి 23న మంత్రి కేటీఆర్​ ఓపెనింగ్‌‌ చేశారు. వెంటనే లబ్ధిదారులను గుర్తించి వారికి ఇండ్లు అప్పగిస్తామన్నారు. కానీ, లబ్దిదారులకు ఇండ్లను ఇంకా వారికి అప్పగించలేదు. 2019 ఆగస్టు నెలలో రూ.22 కోట్లతో మరో 416 డబుల్‌‌ బెడ్‌‌రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇవి ఇంకా పూర్తి కాలేదు. ఫినిషింగ్‌‌ దశలో ఉన్నాయి. వీటికి ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

లబ్దిదారుల లిస్ట్‌‌ ప్రకటించిన కలెక్టర్‌‌

544 డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్లకోసం ఆన్‌‌లైన్‌‌లో . 3,088 మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో జిల్లాస్థాయి ఆఫీసర్లతో ఎంక్వైరీ చేశారు. జిల్లాస్థాయి ఆఫీసర్లను టీమ్‌‌లుగా ఏర్పాటు చేయగా ఇంటింటికి తిరిగి లబ్దిదారుల పూర్తి వివరాలు రాసుకొని వచ్చారు. ఫీల్డ్‌‌లోనే జీపీఎస్‌‌ ఆధారంగా ఫొటోలు కూడా తీసి జిల్లా కలెక్టర్‌‌కు రిపోర్ట్‌‌ ఇచ్చారు. ఈ రిపోర్ట్‌‌ ఆధారంగా మున్సిపల్‌‌ శాఖ ఆఫీసర్లు 544 ఇండ్లకు గానూ తొలిదశలో 350 మంది లబ్దిదారుల జాబితా రెడీ చేసి కలెక్టర్‌‌కు పంపించారు. అయితే ఈ లీస్ట్‌‌ను కూడా రీ ఎంక్వైరీ చేయాలని కలెక్టర్‌‌ భవేశ్‌‌ మిశ్రా మరోసారి ఆర్డర్స్‌‌ జారీ చేశారు. జిల్లాస్థాయి ఆఫీసర్లను 7 టీమ్‌‌లుగా విభజించి ఒక్కో టీమ్‌‌కు 50 మంది లబ్దిదారుల పేర్లు, వివరాలను అందించారు. రెండోసారి ఎంక్వైరీ పూర్తి చేసిన తర్వాత 544 మంది లబ్దిదారుల జాబితాను కలెక్టర్‌‌ ప్రకటించారు. ఇది జరిగి కూడా రెండు నెలలు దాటింది. ఈ లీస్ట్‌‌లో కూడా సుమారు 70 మంది వరకు అనర్హుల పేర్లు ఉన్నట్లుగా జిల్లా కలెక్టర్‌‌కు ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపి అనర్హుల పేర్లను లిస్ట్‌‌ నుంచి కలెక్టర్‌‌ తొలగించినట్టు ప్రచారం జరుగుతుంది. 

ALSO READ :కాజోల్.. కాంట్రవర్సీ కామెంట్స్

నెలకు 3 వేల కిరాయి కడుతున్నా!

కేటీఆర్ సారు వచ్చి డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్లు స్టార్ట్‌‌ చేసిండు.   ఐదు నెలలు దాటింది.  లిస్ట్‌‌ ప్రకటించి మూడు నెలలు దాటింది. డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్లకు ఓన్లీ నెంబర్లు మాత్రమే వేశారు. కానీ మా చేతికి ఎలాంటి   పత్రాలు ఇవ్వలేదు. కనీసం కరెంటు, నీళ్ల సప్లయ్​   కల్పిస్తే..  మిగతా వర్కులన్నీ మేమే చేసుకునేటొళ్లం.   అసలు ఇండ్లు ఇస్తారా.. ఇవ్వరా?  ఇస్తే ఎన్నడిస్తరు. ఇంకా నెలకు 3 వేల ఇల్లు కిరాయి కట్టలేక సతమవుతమవుతున్న.

దాస్ సుజిత్, డబుల్‌‌ బెడ్‌‌ రూం లబ్దిదారుడు, భూపాలపల్లి 

డబుల్‌‌ ఇండ్ల కోసం పోరాడుతాం!

ఎస్‌‌డీఎఫ్‌‌ తరపున అర్హులకు  డబుల్‌‌ బెడ్‌‌రూం ఇండ్లు అందించాలని పోరాటం చేస్తాం. భూపాలపల్లిలో అర్హులకు ఇండ్లు ఇవ్వాలని ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఇళ్లల్లోకి కూడా ప్రవేశించారు. అయినా ప్రభుత్వంలో మార్పు రాలేదు. 2బీ హెచ్‌‌కే ఇండ్ల కోసం మరోసారి పోరుబాట పడ్తాం. 

‒ ఆకునూరి మురళి, జిల్లా పూర్వ కలెక్టర్‌‌, ఎస్‌‌డీఎఫ్‌‌ రాష్ట్ర కన్వీనర్‌‌