ఎల్లారెడ్డిపేట, వెలుగు: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్ లీడర్లు రాజన్నపేట నుంచి వేములవాడ రాజన్న ఆలయానికి పాదయాత్రగా వెళ్లి మొక్కులు సమర్పించుకున్నారు. ఆదివారం కేటీఆర్ దత్తత గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట నుంచి మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, జడ్పీటీసీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక ఆధ్వర్యంలో కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లను మంత్రి కేటీఆర్ రూ.వేల కోట్లతో అభివృద్ధి చేశారని, ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని శపథం చేస్తూ రాజన్న ఆశీస్సుల కోసం ఈ పాదయాత్ర నిర్వహించినట్లు చెప్పారు.