కొత్తగూడ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ 263 కోట్ల రూపాయలతో 3 కిలో మీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ను నిర్మించింది. ఫ్లైఓవర్కు అనుబంధంగా కొత్తగూడ జంక్షన్లో 470 మీటర్ల పొడవుతో 11 మీటర్ల వెడల్పుతో అండర్ పాస్ను సైతం ఏర్పాటు చేశారు.
కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభంతో కొండాపూర్, గచ్చిబౌలి వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ ఫ్లై ఓవర్ వలన బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్లలో 100 శాతం .. కొండాపూర్ జంక్షన్లో 65 శాతం ట్రాఫిక్ సమస్య తీరుతుందని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తైతే ఎస్ఆర్డీపీ ద్వారా ఈ ప్రాంతంలో ప్రతిపాదించిన పనుల్లో మల్టీలెవల్ ఫ్లైఓవర్ మినహా అన్ని పనులు పూర్తైనట్లేనని అధికారులు చెబుతున్నారు.