సెప్టెంబర్ 30 న సత్తుపల్లి కి మంత్రి కేటీఆర్

సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.90 కోట్లతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఈనెల 30న మంత్రి కేటీఆర్​ శంకుస్థాపనలు చేసేందుకు వస్తున్నట్టు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 200 మందికి రూ.1.3 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. 

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పటి నుంచి రైతుని రాజుగా చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్​ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసుదేవరావు పాల్గొన్నారు.