
పురపాలక, పట్టణ అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. అందులో భాగంగా రూ. 1157 కోట్ల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ. 714 కోట్ల వ్యయంతో చేపట్టిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఎత్తిపోతల పథకాన్ని (27 ప్యాకేజ్) ప్రారంభించనున్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా రూ.23.91 కోట్ల వ్యయంతో నిర్మల్ పట్టణంలో ఇంటింటికి నల్లా నీటి సరఫరాను ప్రారంభిస్తారు.
శంకుస్థాపనల విషయానికొస్తే..
- సోన్ మండలం పాత పోచంపహాడ్ గ్రామంలో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ. 250 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ ప్యాకర్టీ నిర్మాణానికి శంకుస్థాపన.
- నిర్మల్ పట్టణంలోని తహసీల్ కార్యాలయ స్థలంలో 2.30 ఎకరాల విస్తీర్ణంలో రూ.10.15 కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ కు శంకుస్థాపన.
- నిర్మల్ పట్టణంలో రూ. 2 కోట్ల టియూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మించే దోబీ ఘాట్ పనులకు శంకుస్థాపన.
- నిర్మల్ పట్టణంలో రూ. 4 కోట్ల టియూఎఫ్ఐడీసీ నిధులతో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
- నిర్మల్ పట్టణంలో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు అమృత్ పథకంలో భాగంగా రూ.62.50 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన
- నిర్మల్ పట్టణంలో రూ. 50 కోట్ల టియూఎఫ్ఐడీసీ నిధులతో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా రూ. 25 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఈ క్రమంలోనే ఎన్టీఆర్ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న బహిరంగసభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.