బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంత్రి కేటీఆర్ బీఫామ్ అందుకున్నారు. తన తాత, నాయనమ్మ (రాఘవరావు, వెంకటమ్మ)దివ్య ఆశీస్సులతో కేటీఆర్ ఎన్నికల కదనరంగంలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్లో అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఇవాళ 51 మందికి బీఫాంలు ఇస్తున్నామని.... మిగతా వారికి రేపు, ఎల్లుండి బీఫాంలు అందజేస్తామని కేసీఆర్ తెలిపారు. కామారెడ్డి సీటుకు సీఎం కేసీఆర్ తరపున ఎమ్మెల్యే గంప గోవర్థన్ బీఫాం తీసుకున్నారు. ఇక బాల్కొండ సీటుకు మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ కవిత బీఫాం అందుకున్నారు. వేముల తల్లి మరణంతో ఆయన మీటింగ్ కు అటెండ్ కాలేదు.
ఒక్కో అభ్యర్థికి రెండు బీఫాంలు ఇస్తున్నామని.... నామినేషన్ల టైంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు గులాబీ బాస్. ఏవైనా సమస్యలు వస్తే.... బీఆర్ఎస్ లీగల్ టీమును సంప్రదించాలన్నారు. ఇక అభ్యర్థికి బీఫాంతో పాటు ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్కరికి 40 లక్షల చెక్కును అందజేశారు కేసీఆర్.