కామారెడ్డి జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి శివారు దేవునుపల్లి దగ్గర మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించారు కాంగ్రెస్ నేతలు. కామారెడ్డికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళనకారులు. ఒక్కసారిగా మంత్రి కాన్వాయ్ ను అడ్డుగా వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వాహనాల్లో తరలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నిరసనలతో కేటీఆర్ టూర్లో టెన్షన్ వాతావరణం కనిపించింది.
మరోవైపు కామారెడ్డి మున్సిపాల్టీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్. 28 కోట్ల రూపాయలతో రోడ్లు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు.