- అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు
మంచిర్యాల, వెలుగు : అక్టోబర్1న మున్సిపల్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారని చెన్నూర్ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా రెండు మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మంత్రి పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే గురువారం కలెక్టర్ బదావత్ సంతోష్, అడిషనల్కలెక్టర్ (లోకల్‌బాడీస్) బి.రాహుల్, డీసీపీ సుధీర్ రామ్ నాథ్ కేకన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్నిర్వహించారు.
మందమర్రి మండలం శంకర్‌పల్లిలో రూ.500 కోట్లతో పామాయిల్ఇండస్ట్రీ నిర్మాణానికి శంకుస్థాపన, మందమర్రిలో రూ.40 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవం, రూ.29.68 కోట్లతో నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవంతోపాటు రూ.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహిస్తారని చెప్పారు. రూ.8 కోట్లతో పాలవాగుపై బ్రిడ్జి నిర్మాణం, రూ.3.30 కోట్లతో మందమర్రిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, రూ.2 కోట్లతో నిర్మించిన
సమ్మక్క–సారలమ్మ మహిళా భవన్, రూ.కోటితో నిర్మించిన కేసీఆర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ భవనం, రూ.1.54 కోట్లతో 2 చెక్ డ్యామ్స్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని, మందమర్రిలో రోడ్ షోలో పాల్గొంటారని తెలిపారు. వీటితోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేటీఆర్టూర్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.