సీఎం కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు(72) గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం గుండె పోటుతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న హరినాథరావు ఇవాళ (గురువారం) మధ్యాహ్నం 1:10 నిమిషాలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. హరినాథరావు మృతి విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ,ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. హరినాథరావు పార్థివదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు.
హరినాథరావు పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ ,ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్, హోంమంత్రి మహముద్ అలీ, మేయర్ విజయలక్ష్మీ హరినాథరావుకు నివాళి అర్పించారు. ఇంకా పలువరు ప్రముఖులు, రాజకీయ నాయకులు హరినాథరావుకు నివాళి అర్పించడానికి ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.