సిరిసిల్లలో నేత కళాకారుడు నల్లా విజయ్ మరొక అద్భుతమైన కళను ఆవిష్కరించారు. ఇప్పటికే తన నేత ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షించిన విజయ్ ఈ సారి సువాసనలు వెదజల్లే వెండి చీరలను మగ్గంపై నేశారు. ఇవాళ మంత్రి కేటీఆర్ ఈ వెండి చీరను ఆవిష్కరించారు. సుగంధ ద్రవ్యాలు, వెండితో ఈ చీరను తయారు చేసినట్టు మంత్రి కేటీఆర్ కు విజయ్ చెప్పారు. దాదాపు నెలన్నర పాటు ఈ చీర కోసం కష్టపడ్డానని చెప్పారు.
ఇప్పటిదాకా విజయ్ నేసిన వస్త్ర ఉత్పత్తులకు సంబంధించి వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. విజయ్ కళా నైపుణ్యాన్ని కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ నేతన్నల అనితర సాధ్యమైన.. అద్భుతమైన ప్రతిభకు విజయ్ నిదర్శనం కొనియాడారు. సిరిసిల్లకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. విజయ్ కు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ చెప్పారు.