మునుగోడు పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం పూర్తైన అనంతరం మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి శివన్న గూడెంలో అంశాల స్వామి కట్టుకున్న కొత్త ఇంటికి వెళ్లారు. స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ వారి ఇంట్లో భోజనం చేశారు. స్వామి నడుపుతున్న సెలూన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులోనూ ఆయన కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఫ్లోరోసిస్ కారణంగా దివ్యాంగుడిగా మారిన అంశాల స్వామి పరిస్థితి గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. గతంలో ఆయనకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేశారు. దాంతో పాటు డబుల్ బెడ్రూం ఇల్లు కోసం ప్రభుత్వం తరఫున ఐదున్నర లక్షల రూపాయలు మంజూరు చేయించారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కర్నాటి విద్యాసాగర్ కు స్వామి ఇంటి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.