
రాష్ట్ర బీజేపీ నాయకులపైనా తీవ్రస్థాయిలో మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందో లేక అరికాళ్లలో ఉందో నాకైతే తెల్వదు. మోడీ వ్యాక్సిన్ కనిపెట్టాడని మాట్లాడుతాడు. అప్పుడు నేను చెప్పాను. మోడీకి నోబుల్ బహుమతి ఇప్పిద్దామని కిషన్ రెడ్డికి చెప్పాను అంటూ సెటైర్ వేశారు. ఇటు బండి సంజయ్ పైనా విమర్శల దాడి పెంచారు.
బండి సంజయ్ పైనా విసుర్లు
‘బండి సంజయ్ కు వారం, దేవుడు తప్ప ఇంకేమీ తెల్వదు. ఆయనకు మెదడులో సరుకు లేదు. మోడీ దేవుడు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎవరికీ దేవుడు. నీకా..? అదానీకా..? 70 రూపాయలు ఉన్న లీటరు పెట్రోలును 115 రూపాయలుకు చేసినందుకు మోడీ దేవుడా..? 400 రూపాయలు ఉన్న ఒక సిలిండర్ ను 1200 రూపాయలు చేసిందుకా..? ఢిల్లీలో700 మంది రైతుల ప్రాణాలు తీసినందుకా..? గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పతనమైనందుకా..? మోడీ దేవుడు’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.