రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న జాతీయ సమైక్యతా దినోత్సవ సభలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. సభా వేదికపై మంత్రి కేటీఆర్ కూర్చున్న చోటుకు దూసుకెళ్లాడు. వందల మంది పోలీసులు ఉన్నప్పటికీ స్టేజీ కిందనున్న యువకుడు ఒక్కసారిగా స్టేజీ పైకి ఎక్కాడు.
కేటీఆర్ వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు...? ఎందుకోసం వచ్చాడు..? అని ప్రశ్నిస్తూ విచారణ చేస్తున్నారు. ఆ యువకుడు మేడిపల్లి మండలవాసి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.