మానేరు డ్యాంలో బోటు నడిపిన మంత్రి కేటీఆర్.. ఫోటోలు వైరల్

నిత్యం సభలు, సమావేశాలతో బిజీ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ కాసేపు సరదాగా గడిపారు. స్వయంగా బోటు నడుపుతూ అందరిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరులోని బోటింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి బోటింగ్ యూనిట్ ను ప్రారంభించిన కేటీఆర్.. ఆ తర్వాత అక్కడి ప్రాంతాల్లో కొద్దిసేపు కలియతిరిగారు. అనంతరం పర్యాటకుల్లో ఉత్సాహం నింపేందుకు మంత్రి కేటీఆర్ స్వయంగా బోటు నడిపారు. జలాశయంలో బోటుపై తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించారయన. పర్యాటకులను ఆకర్షించేందుకే.. బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. 

120 మంది ఒకేసారి ప్రయాణించేలా డబుల్ డెక్కర్ ఏసి క్రూయిజ్, 20 మంది ప్రయాణించేలా అమెరికన్ ప్లేట్లూన్ డీలక్స్, నలుగురు ప్రయాణించేలా స్పీడ్ బోట్స్ అందుబాటులోకి తెచ్చామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.