అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1న ఖనిలో దశాబ్ది ప్రగతి సభ.. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్​

గోదావరిఖని, వెలుగు: వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1న గోదావరిఖనికి రానున్నారు. ఈ సందర్భంగా రామగుండం దశాబ్ది ప్రగతి సభ పేరిట సింగరేణి స్టేడియంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. గురువారం సభా ప్రాంగణ స్థలాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముజమ్మిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరుణశ్రీ, ఇతర అధికారులు పరిశీలించారు. 

అంతర్గాం మండలంలో ఎన్నో ఏళ్ళుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కుర్సుకమ్మి భూములకు పట్టాలు, జీవో 79, 58,59 ప్రకారం స్థలాలకు పట్టాల పంపిణీ, అంతర్గాంలోని ఐటీ పార్కుకు భూమి పూజ, బీసీ, మైనార్టీ బంధు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ తదితర కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ సభకు భారీఎత్తున జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు, లీడర్లు పాల్గొన్నారు.