అక్టోబర్ 9న భూపాలపల్లి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. హాజరుకానున్న మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిశ్రా 
  • అంగడిబజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బహిరంగ సభ


జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభానికి ముస్తాబయ్యాయి. మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజరై ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. ఆయన వెంట మంత్రులు మహమూద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ, ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రానున్నారు. మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిశ్రా, ఎస్పీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్పీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 

అంగడి బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బహిరంగ సభ

కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యాక పలు అభివృద్ధి పనులను కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించనున్నారు. అనంతరం అంగడి బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిశ్రా, ఎస్పీ కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదివారం పరిశీలించారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం చేపట్టాల్సిన పనుల బాధ్యతను వివిధ జిల్లాస్థాయి ఆఫీసర్లకు అప్పగించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి నోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్వర్లును నియమించారు. మరో వైపు అంగడిబజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బహిరంగ సభకు సైతం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు నియోజకవర్గం నుంచి సుమారు 10 వేల మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ALSO READ  :- కాంగ్రెస్ లిస్టు ఇంకింత లేటు.. బస్సు యాత్ర తర్వాత ప్రకటించే చాన్స్

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి

పరకాల, వెలుగు : హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గకేంద్రంలో సోమవారం జరగనున్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. సబా స్థలాన్ని ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించి మాట్లాడారు. నూతన మున్సిపాలిటీతో పాటు ఆర్డీవో, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించనున్నారని చెప్పారు. అనంతరం డిగ్రీ కాలేజీ, పరకాల-–దామెర డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు, చలివాగు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాం, దోభీఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.

పరకాల బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీజేపీ పిలుపు

పరకాల, వెలుగు : మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం పరకాల బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలుపునిచ్చారు. స్థానిక బీజేపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొలుగూరి భిక్షపతి మాట్లాడుతూ పరకాలకు సీఎం కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్చంధంగా బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి, కౌన్సిలర్లు బెజ్జంకి పూర్ణాచారి, కొలనుపాక భద్రయ్య పాల్గొన్నారు.