రేపు సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ షెడ్యూల్

మంత్రి కేటీఆర్ రేపు(మంగళవారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ముస్తాబాద్ మండలం మొహినికుంటలో కల్వకుంట్ల చక్రధర్ రావు   కుటుంబానికి పరామర్శిస్తారు. 11.30 గంటలకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేటలో  ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్యాబ్ లు  పంపిణీ చేస్తారు.   మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో  వృద్ధాశ్రమం ప్రారంభిస్తారు. 

మధ్యాహ్నం 1 గంటకు రాచర్ల గొల్లపల్లిలో ఎల్లమ్మ సిద్ధోగానికి హాజరవుతారు. రైతువేదికను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి  రాచర్ల బొప్పాపూర్ లో గ్రామపంచాయతీ భవనం,రాగట్లపల్లిలో గ్రామ ,వెంకటాపూర్ గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభిస్తారు.   సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల లోని కలెక్టరేట్ లో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తారు.