వరంగల్‌‌కు ఇయ్యాల కేటీఆర్‌‌

హైదరాబాద్‌‌, వరంగల్ సిటీ, వెలుగు : మంత్రి కేటీఆర్‌‌ శనివారం వరంగల్‌‌ లో పర్యటించనున్నారు. నెల రోజుల టైమ్​లో ఆయన వరంగల్‌‌ వెళ్లడం ఇది రెండోసారి. పర్యటనలో కాకతీయ మెగా టెక్స్‌‌టైల్‌‌ పార్క్‌‌లో కేరళకు చెందిన దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్‌‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేయనున్నారు. ఉదయం హెలీకాప్టర్‌‌లో బేగంపేట నుంచి బయల్దేరి 10 గంటలకు కాకతీయ టెక్స్‌‌టైల్‌‌ పార్క్‌‌కు చేరుకుంటారు. భూమి పూజ తర్వాత మిషన్‌‌ భగీరథ వాటర్‌‌ ట్యాంక్‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతారు. సాయంత్రం 5.30కు హెలీకాప్టర్‌‌లో హైదరాబాద్​కు బయల్దేరుతారు.