మంత్రిగారి పుట్టిన రోజు...పేదలకు టమాటాలు పంపిణీ (వీడియో)

మంత్రిగారి పుట్టిన రోజు...పేదలకు టమాటాలు పంపిణీ (వీడియో)

కేటీఆర్..అందునా తెలంగాణ మంత్రి..అందునా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..అందునా..కాబోయే ముఖ్యమంత్రి. మరి ఇలాంటి డైనమిక్ లీడర్ పుట్టిన రోజును ఇంకెంత డైనమిక్ గా నిర్వహించాలి. సాదా సీదాగా చేస్తే కిక్ ఏముంటుంది.. సమ్ థింగ్ స్పెషల్గా నిర్వహిస్తేనే కిక్కు ఉంటుందని భావించిన ఓ బీఆర్ఎస్ లీడర్..వినూత్నంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వరంగల్ లో జరిగిన మంత్రి కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. 

ALSO READ:మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బీఆర్ఎస్ కార్యకర్త

మామూలుగా పుట్టినరోజున కేక్ కట్ చేస్తారు. పిల్లలైతే  చాక్లెట్లు పంచుతారు.  ప్రముఖులు, రాజకీయ నాయకుల పుట్టినరోజు అయితే వారి అభిమానులు అన్నదానమో... రక్తదానమో..లేదా రోగులకు పండ్లు పంపిణీ చేస్తుంటారు. కానీ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా వరంగల్ లో   బీఆర్ఎస్  లీడర్  రాజనాల శ్రీహరి పేదలకు ఉచితంగా టమాటాలు పంపిణీ చేశారు. 

pic.twitter.com/TGtAYwQ12y

— GSREDDY (@GSreddymedia) July 24, 2023

ప్రస్తుతం టమాటా ధరలు మండిపోతున్నాయి. ఎక్కడ చూసినా కిలో 100 పైగా పలుకుతున్నాయి. టమాటాలు కొనాలంటే సామాన్యుడు వణికే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జులై 24వ తేదీన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి పేదలకు టమటాలను పంపిణీ చేశారు. వరంగల్ చౌరస్తాలో రాజనాల శ్రీహరి   మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా  200  మంది పేదలకు గులాబీ రంగు బుట్టలో టమాటాలు ఉచితంగా అందజేశారు. 

ఏ కార్యక్రమాన్ని అయినా డిఫ్రెంట్ గా చేయడం బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి అలవాటే. గతంలోనూ కూడా ఆయన వినూత్నంగా కార్యక్రమాలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజు లిక్కర్, చికెన్ పంపిణీ చేశారు. ప్రస్తుతం టమాటాల పంపిణీతో మరోసారి వార్తల్లో నిలిచారు.