డ్రగ్స్​ టెస్ట్కు నేను సిద్ధం.. బండి సంజయ్​ కు కేటీఆర్​ సవాల్​

రాజన్న సిరిసిల్ల జిల్లా  :   కేసీఆర్​ సర్కారును రాజకీయంగా ఎదుర్కోలేకే.. కేంద్ర ప్రభుత్వం తమపైకి వేట కుక్కలను వదులుతోందని మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యానించారు.“మేం రెడీగా ఉన్నాం. మోడీ గోడీ ఆయన ఈడీ ఎవరైనా రమ్మను. డ్రగ్స్ టెస్ట్ కోసం రక్తంతో పాటు కిడ్నీ కూడా ఇస్తా..మోదీని కూడా ఇమ్మని కోరుతా.. తప్పకుండా నేను క్లీన్​ చిట్​ తో బయటకు వస్తా.. నేను క్లియర్ గా ఉంటే నాపై ఆరోపణలు చేస్తున్న వాళ్లు కరీంనగర్ లో చెప్పు దెబ్బలు తినాలి ” అంటూ కేటీఆర్​ సంచలన కామెంట్స్​ చేశారు.   రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన  ప్రెస్​ మీట్​ లో మంత్రి కేటీఆర్​ మాట్లాడారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కోడె మొక్కుల దేవుడిపై సంజయ్​ కు నిజంగా ప్రేమ ఉంటే..  వేములవాడ గుడికి 500 కోట్ల నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. కరీంనగర్ కు అసలు ఏం చేశారో చెప్పాలన్నారు. చిల్లర మాటలు మాట్లాడితే ఓట్లు రావని, పద్ధతి మార్చుకోవాలంటూ బండి సంజయ్ ను కేటీఆర్ టార్గెట్ చేశారు.