
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ సభలో కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించడం కలకలం రేపింది. ‘శ్రీలక్ష్మీ రియల్ ఎస్టేట్ లో భూపాలపల్లి ఎమ్మెల్యే అనుచురుల భూ కబ్జాలను అరికట్టాలి.. మాకు న్యాయం చేయాలి’ అంటూ సభలో కొందరు బాధితులు ప్ల కార్డులు ప్రదర్శించారు. శ్రీ లక్ష్మీ రియల్ ఎస్టేట్ లో 2005లో ప్లాట్లు కొన్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులపై వెంటనే కేసులు నమోదు చేయాలంటూ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.