మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలకేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు. అనంతరం తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయం నూతన భవన ప్రారంభోత్సవానికి మంత్రి హాజరుకానున్నారు. ఉదయం 11.30 గంటలకు సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారానికి కేటీఆర్ హాజరవుతారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో రైతు కృతజ్ఞత సభకు మంత్రి హాజరవుతారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే నూతన అంగన్వాడీని మంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు