మంత్రి మల్లారెడ్డి మార్చి 28వ తేదిన మంగళవారం పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మేడ్చెల్ జిల్లా మేడిపల్లి మండలం పిజ్జాదిగూడలోని జీఓ.నెం.58కి చెందిన లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి పట్టా సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ క్రమంలో కొంతమంది లబ్ధిదారులకే పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడంతో మిగితా లబ్ధిదారులు మంత్రి మల్లారెడ్డిని నిలదీశారు.
దీంతో ఈ కార్యక్రమం రసభసగా మారింది. మా భూమీకి కూడా పట్టాలివ్వాలంటూ మంత్రిని చుట్టుముట్టారు జనం. తను ఈ విషయంపై అధికారులతో మాట్టాడుతానని.. మీ అందరికి భూములు ఇప్పిస్తానని మంత్రి మల్లారెడ్డి గట్టిగా అరిచారు. మరోవైపు ఈ కార్యక్రమంలో కొంత మంది లబ్ధిదారులకు పట్టాలు అందలేదని మంత్రికి వినతిపత్రం అందించడానికి వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.