ప్రేమలు, పార్టీలు, ఫ్రెండ్ షిప్ లు వదిలేసి కష్టపడి చదవాలని మంత్రి మల్లారెడ్డి విద్యార్థులకు సూచించారు. లైఫ్ పార్ట్నర్లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారన్నారు. తన కొడుకుని డాక్టర్ చదువుకు పంపిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ గా వచ్చిందన్నారు. అదే రెడ్డి అమ్మాయిని ఇచ్చి తన కొడుకుకు పెళ్లి చేసి ఉంటే పార్టీలు, కిట్టీ పార్టీలు, పిక్నిక్ లు అంటూ తిరిగేదన్నారు.. కానీ తన మెడికల్ ఇన్ స్టిట్యూట్ లకు తన కోడలు ఎండీ అయిందన్నారు. విద్యార్థులంతా కష్టపడి చదవాలని విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.