పేదలకు సేవ చేస్తున్నా..ఐటీ దాడులు చేసిన్రు: మల్లారెడ్డి

తన 50, 60 ఏళ్ల జీవితంలో కేటీఆర్ లాంటి మంత్రిని చూడలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మల్లారెడ్డి... ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, భారీ భవనాల నిర్మాణం జరగడంతో కార్మికులకు ఖాళీ టైం దొరకడం లేదన్నారు. కార్మికులకు మస్తు పనులు ఉన్నాయని చెప్పారు. పేరుకే కార్మికశాఖ కానీ నిధులకు ఢోకా లేదని.. కార్మిక శాఖలో ఫుల్ నిధులున్నాయని తెలిపారు. 

‘మెడికల్ కాలేజీలు పెట్టిన, పేదలకు సేవ చేసిన. అయినా నా మీద ఐటీ దాడులు జరుగుతాయా అధ్యక్ష?. ఐదెకరాల్లో రాజ్ భవన్ లా ఇల్లు కట్టుకున్న ఈటల, వివేక్ వెంకటస్వామిలపై ఐటీ దాడులు చెయ్యాలి’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.