ప్రజలు చస్తున్నా పట్టించుకోరా?..ఈఎస్ఐ ఆఫీసర్లపై మంత్రి ఆగ్రహం

ప్రజలు చస్తున్నా పట్టించుకోరా?..ఈఎస్ఐ ఆఫీసర్లపై మంత్రి ఆగ్రహం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ దవాఖాన్లలో మందుల కొరతపై మంత్రి మల్లారెడ్డి ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చే డబ్బులతో జీతాలు తీసుకుంటూ, వాళ్లు రోగాలతో చచ్చిపోతున్నా పట్టించుకోరా? అని ఫైర్ అయ్యారు. న్యాక్ లో ఈఎస్ఐ డాక్టర్లు, ఆఫీసర్లతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిపడా మందులు కొంటున్నప్పుడు, రోగులకు ఎందుకు మెడిసిన్స్ అందడం లేదని ప్రశ్నించారు. అసలు లోపం ఎక్కడుందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. రూ.20 కోట్ల మందులు కొన్నట్టు అధికారులు చెప్పగా, అవన్నీ ఎక్కడికిపోయాయో చెప్పాలని మంత్రి అడిగారు. ఎక్స్ పైరీ అయిన మందులను రోగులకు ఇవ్వొద్దని, ఎక్కువ మెడిసిన్స్ కొని వాటిని మోరీల్లో పారబోయొద్దని సూచించారు.

డాక్టర్లు టైమ్ కు రావాలె..

డాక్టర్లు, సిబ్బంది టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డ్యూటీలకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తేనే, సిబ్బంది కూడా వస్తారని మంత్రి అన్నారు. కరోనా వల్ల పేషెంట్లు రావడానికే భయపడుతుంటే, వారిని మరింత భయపెడుతున్నారని ఆఫీసర్లపై ఫైర్ అయ్యారు. డిస్పెన్సరీలకు ఎన్ని మందులు కావాలో వెంటనే వివరాలు అందజేయాలని, సిబ్బంది ఎంతమంది అవసరమో చెప్పాలని ఆదేశించారు. డిస్పెన్సరీలు, హాస్పిటళ్లలో ఉన్న పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలన్నారు. ఇక నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.