మంత్రి మల్లారెడ్డికి సొంత నియోజకవర్గంలో నిరసనలు తప్పడంలేదు. శామీర్ పేట మండలం అలియాబాద్ లో సమస్యలపై మంత్రిని నిలదీశారు స్థానికులు. కొన్నేండ్లుగా గ్రామంలో మురుగునీటి సమస్య ఉందని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని నిలదీశారు. కరోనా తర్వాత పరిస్థితులు బాగా లేవని.. సొంత డబ్బులు అభివృద్ధికి ఖర్చు చేస్తున్నానని మల్లారెడ్డి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు.
దీంతో స్తానికులు, మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. రేవంత్ రెడ్డిని..కిషన్ రెడ్డిని అడగండి అంటూ మల్లారెడ్డి బదులిచ్చారు. స్థానిక ఎమ్మెల్యేవు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నామని స్థానికులు నిలదీశారు. తనను ప్రశ్నించేవాళ్లంతా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలేనని అన్నారు మల్లారెడ్డి. సమస్యలుంటే మీ లీడర్లను అడగండని బదులిచ్చారు. పోలీసులు వచ్చి స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా స్థానికులు స్లోగన్స్ ఇవ్వడంతో.. మంత్రి అక్కడ నుంచి వెళ్లిపోయారు. సమస్యలపై ప్రశ్నిస్తే..మంత్రి దౌర్జన్యంగా మాట్లాడారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు.
https://youtu.be/Qn2bR6UIeNU